గజ గజ వణుకుతున్న ఏజెన్సీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్ర పెరిగింది. అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్ర పెరిగింది. అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటల వరకూ బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకు వంటి ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అత్యల్పంగా...
తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతం కూడా చలికి గజగజ వణుకుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లాలో అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీర్మాణిలో 9.3 డిగ్రీలు, వాంకిడిలో 9.6, నేరేడుకొండలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చలితీవ్రతకు జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.