రోడ్డుపై రూ. 500 నోట్ల కలకలం

జాతీయ రహదారిపై కరెన్సీ నోట్లు గాలిలోకి ఎగిరిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లా మడపాం టోల్‌గేట్ వద్ద ఈ ఘటన జరిగింది.;

Update: 2023-03-05 05:56 GMT
రోడ్డుపై రూ. 500 నోట్ల కలకలం
  • whatsapp icon

జాతీయ రహదారిపై కరెన్సీ నోట్లు గాలిలోకి ఎగిరిపడ్డాయి. ఆటోలో కొందరు నగదు తరలిస్తుండగా నగదు గాలిలోకి ఎగి జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం నుంచి వస్తున్న ఒక ఆటో నుంచి ఈ ఐదు వందల రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలు...
అయితే డబ్బు గాలిలో ఎగిరిపడుతున్నప్పటికీ ఆటో ఆగకుండా వెళ్లిపోయింది. టోల్‌గేట్ సిబ్బంది వాటిని సేకరించారు. ఆటో ఎవరిది అన్న విషయం తెలియలేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆటోలో నగదును తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 88 వేల రూపాయల నగదును టోల్ సిబ్బంది సేకరించి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఎవరైనా తగిన ఆధారాలతో వస్తే తాము నగదును అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.


Tags:    

Similar News