చంద్రబాబు అరెస్టుపై స్పందించిన పురందేశ్వరి

చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు;

Update: 2023-09-09 03:48 GMT
purandeshwari, cbn, chandrababunaidu, chandrababuarrest, chandrababunaiduarrested
  • whatsapp icon

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. "ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది." అంటూ పోస్టు పెట్టారు.
సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీసు ఇచ్చారు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు బాబుపై 120(బీ), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. మరో వైపు ఇదే కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును, ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు.



Tags:    

Similar News