Visakha MLC Election : ముగిసిన విశాఖ ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ గడువు

విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఉప ఎన్నికకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి

Update: 2024-08-13 12:52 GMT

విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యానారాయణ నామినేషన్‌ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్‌ వేశారు. దీంతో ఇద్దరు మాత్రమే ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్ వేశారు.

ఇద్దరు బరిలో...
అయితే ఈ ఎన్నికల నుంచి ఎన్టీఏ కూటమి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపునకు మార్గం సులువుగా మారింది. కానీ ఈ నెల 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల పరిశీలనలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఓకే అయితే ఎన్నిక జరుగుతుంది. లేకుంటే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.


Tags:    

Similar News