కోనసీమ పేరు ఏంటీ?
కోనసీమ పేరుపై ప్రభుత్వం ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చి గడువు పూర్తయింది. ఇప్పటి వరకూ 6,409 అభ్యర్థనలు వచ్చాయి.
కోనసీమ పేరుపై ప్రభుత్వం ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చి గడువు పూర్తయింది. ఇప్పటి వరకూ 6,409 అభ్యర్థనలు వచ్చాయి. వీరిలో నాలుగు వేల మందికి పైగా కోనసీమ అంబేద్కర్ జిల్లాగానే పేరు ఉంచాలని దరఖాస్తులు ఇచ్చారు. రెండు వేల మంది నుంచి మాత్రం కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని కోరుకుంటున్నారు. ప్రజాభిప్రాయసేకరణ గడువు ఈ నెల 18వ తేదీన పూర్తి కావడంతో అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు.
176 మంది అరెస్ట్....
వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి దీనిపై నివేదిక పంపనున్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరును నిరసిస్తూ గత నెల 24న కొందరు ఆందోళనకారులు హింసాత్మక ఆందోళనలకు దిగిని సంగతి తెలిసిందే. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను దగ్దం చేశారు ఆందోళనకారులు. ఈ ఆందోళనలో 268 మంది పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకూ 176 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మిగిలిన వారి కోసం ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోసారి ప్రభుత్వానికి కోనసీమ జిల్లా పేరు పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.