Nagababu : నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబు పేరును ఎమ్మెల్సీగా ఖరారు చేశారు.;

nagababu
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబు పేరును ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని తొలుత భావించారని ప్రచారం జరిగినా చివరకు ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నాగబాబుకు పవన్ కల్యాణ్ సమాచారం అందించినట్లు తెలిసింది. ఆయనను నామినేషన్ వేయాల్సిందిగా పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
రాజ్యసభ స్థానాన్ని...
ముందుగా భవిష్యత్ లో రాజ్యసభ స్థానాన్ని ఇవ్వాలని అనుకున్నప్పటికీ పవన్ కల్యాణ్ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నారని చెబుతున్నారు. దీంతో నాగబాబును ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఏపీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కూడా ఉందని అమరావతి నుంచి అందుతున్న వర్గాల నుంచి అందుతున్నసమాచారాన్ని బట్టి తెలుస్తోంది.