Pawan Kalyan : రుషికొండ ప్యాలెస్ అవసరమా? అని ప్రశ్నించిన పవన్

తాను ఎక్కువ అంచనాలు పెట్టుకుని పనిచేస్తానని, అవి పూర్తయినప్పుడే తనకు ఆనందమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ‌్ అన్నారు;

Update: 2024-07-01 06:57 GMT
Pawan Kalyan : రుషికొండ ప్యాలెస్ అవసరమా? అని ప్రశ్నించిన పవన్
  • whatsapp icon

తాను ఎక్కువ అంచనాలు పెట్టుకుని పనిచేస్తానని, అవి పూర్తయినప్పుడే తనకు ఆనందమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ‌్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. తాను జీతం తీసుకోవాలన్నా సంశయిస్తున్నానని తెలిపారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలని తాను భావిస్తున్నానని తెలిపారు.

సంక్షేమంతో పాటు...
రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమేనని అన్నారు. తాను పంచాయతీ శాఖ ను సమీక్ష చేస్తున్నప్పుడు నిధులు ఎటు వెళ్లాయో తెలియలేదన్నారు. రుషికొండలో ఆరు వందల కోట్ల ప్యాలెస్ ను నిర్మించిన ప్రభుత్వం గ్రామాలను మాత్రం పట్టించుకోలేదన్నారు. ఆ డబ్బుతో ఎన్నో గ్రామాలకు తాగు నీరు అందించేవాళ్లమని ఆయన అన్నారు. తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని ఆయన మాట ఇచ్చారు. తాను ఇచ్చిన మాట ప్రకారమే పనిచేస్తానని తెలిపారు.


Tags:    

Similar News