జగన్ కు అస్సెట్ అవుతారనే...?
మంచి మాటకారిగా పేరున్న ధర్మాన ప్రసాదరావు జగన్ ఈ రెండేళ్ల పాటు అస్సెట్ అవుతారు.;
శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత, కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ధర్మాన ప్రసాదరావు 1989లో తొలిసారి నరసన్న పేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1991 లో ఆయన మంత్రి పదవి చేపట్టారు. జలనవరుల శాఖ మంత్రి గా పనిచేశారు. 1994, 2009, 2014 ఎన్నికల్లో వరస విజయాలు సాధించి రికార్డు నెలకొల్పారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీ లో చేరారు. 2014లో ఓటమి పాలయినా, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. తొలి మంత్రి వర్గంలో జగన్ ధర్మాన సోదరుడు కృష్ణదాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. రెండో విడత అదే కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చారు. జగన్ ఆయనకు రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశాలున్నాయి. మంచి మాటకారిగా పేరున్న ధర్మాన ప్రసాదరావు జగన్ ఈ రెండేళ్ల పాటు అస్సెట్ అవుతారు.