మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద తాకిడి ఎక్కువయింది. పోలవరం ప్రాజెక్టు క్యాపర్ డ్యామ్ వద్దకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో పలు మండలాలు గోదావరి వరద తాకిడికి గురవుతున్నాయి. దేవీపట్నం మండలంలోకి వరద నీరు ప్రవేశించింది.
సురక్షిత ప్రాంతాలకు...
గండి పోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో అక్కడ పూజాది కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడ్డాయి. గుడి వైపు వెళ్లే రహదారులు పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై నీట మునిగే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నారు.