జగన్ పై పత్తిపాటి ఫైర్
యువ ముఖ్యమంత్రిగా పేరున్న జగన్ వరద ప్రాంతాల్లో పర్యటించకపోవడం సిగ్గు చేటని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు
యువ ముఖ్యమంత్రిగా పేరున్న జగన్ కనీసం వరద ప్రాంతాల్లో పర్యటించకపోవడం సిగ్గు చేటు అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పిన తర్వాత జగన్ మేల్కొన్నాడన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని చెబుతన్నారని, పది రోజుల తర్వాత పర్యటించి ఏం సాధిస్తారని పత్తిపాటి ప్రశ్నించారు. చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తే రాజకీయం కోసం అనడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.
బాధితులు సాయం కోసం...
వరద బాధిత ప్రాంతాల్లోని బాధితులంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటించకపోవడం ఆయన అనుభవ రాహిత్యమా? లేక అహంకారమా? అని పత్తిపాటి ప్రశ్నించారు. పక్క రాష‌్ట్రంలో అందించిన ప్యాకేజీని కూడా ఇక్కడ వరద బాధితులకు అందించకపోవడం సిగ్గు చేటని అన్నారు. విలీన మండలాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరడం సిగ్గు చేటని పత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. కనీసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయకుండా ఎక్కడకు పంపిందని పుల్లారావు ప్రశ్నించారు.