పేర్నినానికి హైకోర్టులో ఊరట
మాజీమంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది;

perni nani
మాజీమంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ6 నిందితుడిగా పేర్ని నాని ఉన్నారు. ఆయన భార్య ఏ1 నిందితురాలిగా ఉన్నారు. ఇప్పటికే రేషన్ బియ్యం మాయంపై నమోదయిన విషయంలో ప్రభుత్వం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.
రేషన్ బియ్యం...
ఈ కేసులో కొందరిని అరెస్ట్ చేసింది. వారు బెయిల్ పై కూడా బయటకు వచ్చారు. అయితే పేర్ని నాని మాత్రం రేషన్ బియ్యం మాయం కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించి ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం పేర్ని నానికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొంత ఊరట లభించినట్లయింది.