వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఈరోజు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు;

Update: 2023-02-16 12:33 GMT

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఈరోజు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన జయమంగళ వెంకటరమణకు ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కైకలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గత కొంత కాలంగా టీడీపీలో అసంతృప్తితో ఉన్నారు.

టిక్కెట్ రాదని...
వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదని భావించిన జయమంగళ వెంకటరమణ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కైకలూరు టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తుతో వెళుతుండటం, తనకు టిక్కెట్ కేటాయింపుపై చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లభించక పోవడంతో ఆయన పార్టీ కండువాను మార్చేశారు. జగన్ నుంచి ఆయనకు ఎమ్మెల్సీ హామీ లభించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


Tags:    

Similar News