హైకోర్టుకు రాజధాని రైతులు
రాజధాని అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. బయట ప్రాంతాల వారీకి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై పిటీషన్ దాఖలు చేశారు
రాజధాని అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. బయట ప్రాంతాల వారీకి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు పిటీషన్ వేశారు. అయితే దీనిపై హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 30 వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
పేదలకు ఇళ్ల స్థలాలు...
రాజధాని అమరావతి ప్రాంతాల్లో 900 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బయట వ్యక్తులకు ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ బహిరంగ నోటీసులు కూడా జారీ చేసింది. ఆర్ ఫైవ్ జోన్ ఏర్పాటు చేసి అందులో 900 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. మాస్టర్ ప్లాన్ లో మార్పులపై పదిహేను రోజుల్లో అభిప్రాయాలు చెప్పాలని నోటీసుల్లో సీఆర్డీఏ కోరింది. దీనిపై తాజాగా రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.