Fengal Cyclone : సముద్రం అల్లకల్లోలం.. కోతకు గురైన ఇళ్లు
ఫెంగల్ తుపాను తన ప్రతాపం చూపుతుంది. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది;
ఫెంగల్ తుపాను తన ప్రతాపం చూపుతుంది. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ, ఉప్పాడ, అంతర్వేదిలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో అలల ఉధృతికి మత్స్యకారుల ఇళ్లు చాలా వరకూ కోతకు గురయ్యయి. మాయపట్నం, అమీనాబాద్, సూరాడపేట, కొత్తపట్నం, జగ్గరాజుపేట, సుబ్బంపేటలో మత్స్యకారులకు తీవ్ర నష్టం జరిగింది. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని నిషేధించారు. కోస్తాంధ్రలోని అన్ని తీర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది.
కుండపోత వర్షా లతో...
ఫెంగల్ తుఫాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలోని రెయిబ్ బో నగర్ వరద నీటిలో మునిగిపోయింది. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు తమిళనాడులో సైతం వర్షబీభత్సం కొనసాగుతోంది. చెన్నై సహా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.