జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జగన్ రావాలని తాను కోరుకుంటున్నానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.;
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జగన్ రావాలని తాను కోరుకుంటున్నానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శాసనసభకు వచ్చి ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. అంతే తప్ప అసెంబ్లీకి రాకుండా ఉంటే గెలిపించిన ప్రజలు కూడా క్షమించరని పయ్యావుల కేశవ్ అన్నారు.
గతంలో చంద్రబాబు...
గతంలో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్‌ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలని ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం సమర్థవంతంగా వివిధ అంశాలు వినిపించగలిగితే ప్రభుత్వం కూడా లోటుపాట్లు చేయకుండా ఉంటుందని పయ్యావుల కేశవ్ అన్నారు.