వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం

నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో వైసీపీలో ఫ్లెక్సీ వివాదం రెండు గ్రూపుల మధ్య ఘర్షణలకు దారి తీసింది;

Update: 2023-04-19 04:39 GMT

నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో వైసీపీలో ఫ్లెక్సీ వివాదం రెండు గ్రూపుల మధ్య ఘర్షణలకు దారి తీసింది. ఫ్లెక్సీ తొలగించాలని ఒకరు, ఫ్లెక్సీ తొలగించే దమ్మున్న వారు ఎవరో రండి అంటూ మరొకరు సవాళ్లు విసురుకోవడంతో పరిస్థిితి ఉద్రిక్తంగా మారింది. గడిచిన నాలుగేళ్లలో జలదంకి అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు. భగ్గుమంటూనే ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో ముగ్గురు వైసీపీ కన్వీనర్లు మారారు. ప్రస్తుతంచేవూరు జనార్దన్ రెడ్డి ని కన్వీనర్ గా నియమించారు.

ఇద్దరు నేతల మధ్య...
రాజకీయంలో ఒంటరిగా సతమతమవుతున్న మాజీ సర్పంచి తిప్పారెడ్డి ఇందిరమ్మ ఒక వర్గంగానూ మరొక వర్గంగా ఘర్షణకు దిగుతున్నారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో నియోజకవర్గంలోనే కాకుండా జలదంకి మండలంలో తరచూ ఘర్షలు చోటు చేసుకుంటున్నాయి.


Tags:    

Similar News