Andhra Pradesh : ఇంద్రకీలాద్రికి పాదయాత్రగా అమరావతి రైతులు

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అమరావతి రైతులు ఇంద్రీకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు

Update: 2024-06-23 02:28 GMT

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అమరావతి రైతులు ఇంద్రీకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. ఏపీలో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తాము పాదయాత్రగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిని పాదయాత్రగా వచ్చి దర్శించుకుంటామని రైతులు మొక్కుకున్నారు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు, ఆయన రాజధాని ప్రాంతాల్లో పర్యటించి అమరావతి అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందిస్తుండటంతో ఈరోజు తెల్లవారు జామున రాజధాని రైతులు ఇంద్రకీలాద్రికి పాదయాత్రగా బయలుదేరారు.

మొక్కులు చెల్లించుకునేందుకు...
ఆదివారం తెల్లవారు జామున ప్రారంభించిన పాదయాత్ర ఉదయం పదకొండు గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకోనుంది. అక్కడ దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు. రాజధాని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభమయింది. కాలినడకన బయలుదేరి దుర్గమ్మను దర్శించుకునేందుకు రైతులు బయలుదేరారు. ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రాజధాని అమరావతి రైతులు పాల్గొన్నారు. వీరంతా మొక్కులు చెల్లించుకోనున్నారు.


Tags:    

Similar News