టీడీపీతో జనసేనను కలవనివ్వడం లేదు

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2023-04-20 07:17 GMT

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో కలవడానికి పవన్ ముందుకొస్తుంటే బీజేపీ భయపెడుతుందన్నారు. బీజేపీ రాష‌్ట్రంలో ప్రతిపక్షంగా ఉండి జగన్ కు సహకరిస్తుందన్నారు. బీజేపీ ముందు ఒక రాజకీయం, తెరవెనుక మరో రాజకీయం చేస్తుందన్నారు. మూడు రాజధానులపై ఒకసారి అవునంటారని, మరోసారి కాదంటారని పితాని సత్యనారాయణ ధ్వజమెత్తారు.

భయపెడుతూ...
కానీ పవన్ ను టీడీపీతో కలవకుండా చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కుదరవని పితాని సత్యనారాయణ అన్నారు. టీడీపీతో జనసేన కలుస్తుందని బీజేపీ భయపడిపోతుందన్నారు. అందుకే పవన్ ను వెనక్కు లాగేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని పితాని సత్యనారాయణ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందనుకుంటున్న నేపథ్యంలో పితాని వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారాయి.


Tags:    

Similar News