సీఎం జగన్ తో సజ్జల భేటీ.. మంత్రి వర్గం కూర్పు...?
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ తో సమావేశమయ్యారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై చర్చిస్తున్నారు;
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై చర్చిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉండనుంది. కేవలం 24 గంటలు మాత్రమే గడువు ఉండటంతో మంత్రి వర్గ సభ్యుల జాబితాను ఈరోజు ఫైనల్ చేయనున్నారు. దాదాపు రెండు గంటల నుంచి ముఖ్యమంత్రి జగన్ తో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం కొనసాగుతుంది.
సీనియర్ నేతలను...
అదే సమయంలో సామాజికవర్గాల సమీకరణాలతో పాటు సీనియర్ నేతలను కేబినెట్ లో కొనసాగించే విషయంపై కూడా చర్చిస్తున్నట్లు తెలిసింది. సీనియర్ నేతలకు పార్టీ బాధ్యతలను అప్పగించేకన్నా మంత్రివర్గంలోనే కొనసాగించడం మేలన్న అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలలో యువకులకే జిల్లా బాధ్యతలను అప్పగించాలన్న భావనతో ఉన్నారు. ఈరోజు మంత్రి వర్గసభ్యుల జాబితా ఫైనల్ అయ్యే అవకాశముంది.