పనిదినాలు పెంచాలంటూ కేంద్రానికి ఏపీ వినతి
ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిదినాల సంఖ్య పెంచాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది;

ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిదినాల సంఖ్య పెంచాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 2025-26 సంవత్సరానికి తమ రాష్ట్రానికి 26.77 కోట్ల పనిదినాల్ని కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అధికారుల బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్ను ఢిల్లీలో కలిశారు.
కూలీల సంఖ్యకు తగినట్లుగా...
రాష్ట్రంలో భారీగా పెరిగిన కూలీల సంఖ్యకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు. పనిదినాలు పెంచిదే ఉపాధి అవకాశాలు మరింత పెరిగి పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఇప్పటికే కొన్ని చోట్ల పనులు లేక వలసలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ఉన్న నిబంధనలు ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టిస్తున్నాయని తెలిపారు.