Annavaram : అన్నవరం నెయ్యి సరఫరాపై ఆరా
అన్నవరంలో నెయ్యి సరఫరాపై ప్రభుత్వం ఆరా తీసింది. అధికారులు తక్కువ ధరకు నెయ్యిని కొనుగోలు చేయడంపై విచారణ ప్రారంభించింది.
అన్నవరంలోనూ నెయ్యి సరఫరాపై ప్రభుత్వం ఆరా తీసింది. అధికారులు తక్కువ ధరకు నెయ్యిని కొనుగోలు చేయడంపై విచారణ ప్రారంభించింది. అతి తక్కువ ధరకు రైతు డెయిరీ నుంచి నెయ్యిని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం బోర్డు కొనుగోలు చేస్తుంది. అదే నెయ్యిని బయట మార్కెట్ లో ఎక్కువ ధరకు విక్రయిస్తుంది.
అంత తక్కువ ధరకు...
మరి అన్నవరానికి అంత తక్కువ ధరకు ఎందుకు సరఫరా చేస్తున్నదన్న దానిపై విచారణ జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ విధానంలో తక్కువ ధరకు ఎలా కోట్ చేశారన్న దానిపై విచారణ చేయాలని నిర్ణయించారు. అన్నవరం ప్రసాదం భక్తులకు అత్యంత ఇష్టమైనది. అందులో నెలకు లక్ష కేజీలకు పైగా నెయ్యిని వాడతారు. దీనిని ఏలూరు నుంచి రైతు డెయిరీ సరఫరా చేస్తుందని తెలుసుకున్న ప్రభుత్వం దీనిపై ఆరా తీస్తుంది.