ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు;

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకాతిరుమల రావు ఈ నెల 31వ తేదీతో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరీశ్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
1992 బ్యాచ్ కు చెందిన...
హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన వారు. మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొంతకాలం పాటు డీజీపీగా వ్యవహరించారు. ఈ నెల 31తర్వాత ఆయన ఏపీ డీజీపీగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.