Vijayawada : పాలు రోడ్ల పాలు

విజయవాడలో వరద బాధితులకు తీసుకొచ్చిన వందల పాల ప్యాకెట్లు నేలపాలయ్యాయి.;

Update: 2024-09-03 03:14 GMT
milk packets,  flood victims, road, vijayawada
  • whatsapp icon

విజయవాడలో వరద బాధితులకు తీసుకొచ్చిన వందల పాల ప్యాకెట్లు నేలపాలయ్యాయి. పాల ప్యాకెట్లను లారీ నిండా తీసుకువచ్చి అజిత్ సింగ్ నగర్ వంతెన మీద పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోవడంతో ప్యాకెట్లు కింద పడిపోయి పాలన్నీ వృథా అయ్యాయి. మరో వాహనంలో సంగం డెయిరీ పాలు తీసుకువచ్చారు.

తీసుకున్న వ్యక్తులే...
సంగం డెయిరీ సిబ్బంది పంపిణీ చేస్తుండగా.. తీసుకున్న వ్యక్తులే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. దాంతో పంపిణీ చేసే యువకుడు చేతులు జోడించి నమస్కరించినా అక్కడున్న వారు పట్టించుకోకపోవడం గమనార్హం. వీటితో పాటు వందల ప్యాకెట్ల ఆహారమూ వంతెనపై వృథా అయింది. ఆహార పదార్థాల సరఫరా దగ్గర ప్రజలు సంయమనం పాటిస్తే మేలు అని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News