Tirumala Laddoo: ప్రతి రోజూ హైదరాబాద్ లో తిరుమల లడ్డూలు.. ధర ఎంతంటే?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులందరికీ;

Update: 2024-09-08 02:50 GMT
Tirumala Laddoo: ప్రతి రోజూ హైదరాబాద్ లో తిరుమల లడ్డూలు.. ధర ఎంతంటే?
  • whatsapp icon

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే హైదరాబాద్ నగరంలో ప్రతి రోజూ తిరుమల లడ్డూలు లభించనున్నాయి. గతంలో కేవలం శనివారం, ఆదివారాల్లో మాత్రమే తిరుమల లడ్డూలు అందుబాటులో ఉండేవి, అయితే ఇకపై ప్రతి రోజూ లభించేలా చర్యలు తీసుకుంది టీటీడీ.

హైదరాబాద్ నగరం లోని హిమాయత్‌నగర్‌ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని టీటీడీ దేవస్థానాల్లో ప్రతి రోజూ తిరుమల లడ్డూలను విక్రయించనున్నారు. ఒక లడ్డూ ధర 50 రూపాయలుగా నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలయాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు సమాచార కేంద్రాలలో లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ ఇటీవలే తెలిపింది. ఆయా ఆలయాలలో ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తిరుమలలో లడ్డూ దళారులను కట్టడి చేయడం ద్వారా, బయట ప్రాంతాలకు లడ్డూ ప్రసాదాలు పంపుతున్నట్లు వివరించారు.


Tags:    

Similar News