ఏపీలో ఐపీఎస్-ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను

Update: 2024-07-12 04:49 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. లా అండ్ అర్డర్ ఐజీగా శ్రీకాంత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఫైర్ సర్వీసెస్ డీజీగా పైదిరెడ్డి ప్రతాప్ కు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ సీపీగా రాజశేఖరబాబు నియమితులయ్యారు. అంజనా సిన్హాను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డైరెక్టర్ జనరల్ గా నియమించారు. సీహెచ్ శ్రీకాంత్ కు ఐజీ, లా అండ్ ఆర్డర్ బాధ్యతలు ఇచ్చారు. గోపినాథ్ జెట్టికి డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్, విశాఖపట్నం రేంజ్ బాధ్యతలు ఇచ్చారు. ప్రవీణ్ ను కర్నూల్ రేంజ్ డీఐజీగా నియమించారు. విజయా రావు, విశాల్ గున్నీ లను డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం.

మొత్తం 19 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి, రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కాంతీలాల్‌ ను నియమించారు. అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌గా అనంతరాము, రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కాంతీలాల్‌ ను ప్రభుత్వం నియమించింది. సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి, ల్యాండ్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ సీఎస్‌గా రామ్‌ ప్రకాష్‌ సిసోడియా, పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శిగా సురేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
ఏపీ పరిశ్రమలు శాఖ డైరెక్టర్‌గా సి. శ్రీధర్, ఏపీ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జే నివాస్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా వి.విజయరామరాజు నియామకం జరిగింది. క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్ ను నియమించింది ప్రభుత్వం. మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఏ సూర్యకుమారి, సమాచారశాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లాను నియమించారు. ఐటీ శాఖ కార్యదర్శిగా శౌరబ్ గౌర్‌కి అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా ఎన్.యువరాజ్, మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్థన్ నియమితులయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబు బదిలీ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఢిల్లీ రావును నియమించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. లా అండ్ అర్డర్ ఐజీగా శ్రీకాంత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా పైదిరెడ్డి ప్రతాప్,  విజయవాడ సీపీగా రాజశేఖరబాబు నియమితులయ్యారు.మొత్తం 19 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

Tags:    

Similar News