Chandrababu : చంద్రబాబు హార్ట్ బీట్ పై ఆందోళన.. హైకోర్టుకు హెల్త్ రిపోర్టు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెల్త్ రిపోర్టును హైకోర్టుకు ఆయన తరుపున న్యాయవాదులు సమర్పించారు;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెల్త్ రిపోర్టును హైకోర్టుకు ఆయన తరుపున న్యాయవాదులు సమర్పించారు. చంద్రబాబు గుండె పరిణామం పెరిగిందని ఆ హెల్త్ రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా వాల్వ్‌ల్లో బ్లాక్ లు ఉన్నాయని, ఆయనకు గుండెపోటు వచ్చే అవకాశముందని కూడా హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టుల్లో పేర్కొన్నారు. బ్లాక్ లు ఉన్నందున రక్త ప్రసరణ తక్కువగా ఉందని పేర్కొన్నారు.
రేపు మళ్లీ విచారణ...
ఆయన రెగ్యులర్ బెయిల్ పై విచారణ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు తరుపున న్యాయవాదులు హైకోర్టుకు అందచేశారు. ప్రధాన బెయిల్ పిటీషన్ విచారణ నేడు జరిగింది. ప్రభుత్వం తరుపున న్యాయవాదులు ఈరోజు వినిపించారు. రేపటికి విచారణ వాయిదా పడింది. రేపు చంద్రబాబు తరుపున న్యాయవాదులు వినిపిస్తారు.