నా భర్త పార్టీ మారితే నేను మారతా
ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త పార్టీ మారితే తాను కూడా మారతానన్నారు;
ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త పార్టీ మారితే తాను కూడా మారతానని తెలిపారు. తన భర్త ఒక పార్టీలో తాను ఒక పార్టీలో, తన పిల్లలు మరొక పార్టీలో ఉండబోరని, అందరం ఒకే పార్టీలో ఉంటామని మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. ఒక సమావేశంలో మాట్లాడుతూ సుచరిత ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ తోనే ఉండాలని...
అయితే తమ కుటుంబ రాజకీయ జీవితం వైసీపీతోనే ముడి పడి ఉందని ఆమె తెలిపారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు జగన్ తోనే ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ఇతర కుటుంబాల మాదిరిగా కుటుంబ సభ్యుల్లో తలో ఒక పార్టీలో ఉండే సంస్కృతి తమది కాదని ఆమె తెలిపారు.