ఎమ్మెల్యే పదవికి రాజీనామా?

మొన్నటి వరకూ హోంమంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు;

Update: 2022-04-11 02:33 GMT

మొన్నటి వరకూ హోంమంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని సుచరిత కుమార్తె రిషిత మీడియాకు తెలిపారు. సుచరితను మంత్రి పదవి నుంచి తప్పించడంపై ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా మంత్రి పదవి సుచరితకు రాకపోవడానికి కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పుపట్టారు. ఈ విషయంలో సుచరితను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆమె అంగీకరించలేదని తెలిసింది.

పార్టీలోనే....
ఎస్సీలను వైసీపీలో చిన్న చూపు చూస్తున్నారని సుచరిత వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే తన తల్లి సుచరిత ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేస్తారని, పార్టీలోనే కొనసాగుతారని కూతురు రిషిత తెలిపారు. సుచరితను ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేయించి గెలిపించుకుంటామని సుచరిత వర్గీయులు తెలిపారు.


Tags:    

Similar News