టీడీపీ ఆఫర్ తిరస్కరించా : రాపాక సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత టీడీపీ తనతో బేరసారాలు జరిగాయని ఆయన అన్నారు;

Update: 2023-03-26 08:40 GMT
టీడీపీ ఆఫర్ తిరస్కరించా : రాపాక సంచలన కామెంట్స్
  • whatsapp icon

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తొలుత టీడీపీ తనతోనే బేరసారాలు జరిగాయని ఆయన అన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి పది కోట్ల రూపాయలు ఇస్తామని తనతో బేరం ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. తన ఓటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముకుంటే పది కోట్లు వచ్చి ఉండేవని ఆయన తెలిపారు. రాజోలులో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఈ విష‍యం వెల్లడించారు.

పది కోట్లు ఇస్తామన్నారు...
అయితే తన మిత్రుడు కేఎస్‌ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ దగ్గర కూడా ఒక రాజుగారు తనతో బేరాలకు దిగారన్నారు. టీడీపీకి ఓటేయాలని కోరారని, టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని రాపాక వరప్రసాద్ తెలిపారు. అయితే ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమన్న రాపాక, సిగ్గు శరీరం వదిలేసి ఉంటే పదికోట్లు వచ్చి ఉండేవన్నారు. తాను జగన్ ను నమ్మాను కాబట్టే టీడీపీీ ఆఫర్ ను తిరస్కరించానని రాపాక వరప్రసాద్ తెలిపారు.


Tags:    

Similar News