మంచు విష్ణు జగన్ తో భేటీ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కానున్నారు;

Update: 2022-02-15 07:51 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కానున్నారు. జగన్ అపాయింట్ మెంట్ విష్ణుకు లభించింది. మా అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత మంచు విష్ణు జగన్ ను కలవలేదు. అయితే ఇటీవల చిత్ర పరిశ్రమకు చెందిన సమస్యలు అనేకం వచ్చాయి. ఇందులో టాలీవుడ్ ప్రముఖలకు జగన్ తో చర్చలకు ఆహ్వానం అందింది కాని, మా అధ్యక్షుడికి మాత్రం ఆహ్వానం అందలేదు.

సినీ సమస్యలపై.....
సినిమా టిక్కెట్లను ఏపీ లో పెంచడం, చిత్ర పరిశ్రమ సమస్యలపై ఇటీవల జగన్ టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సమాశానికి మంచు కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. జగన్ కు దగ్గర బంధువైన మంచు విష్ణు ఈరోజు జగన్ ను కలిసేందుకు తాడేపల్లి వచ్చారు. సినీ పరిశ్రమ సమస్యలతో పాటు మరికొన్ని విషయాలను ఆయన జగన్ తో చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News