కడప, నంద్యాల జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

నేడు కడప జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు;

Update: 2024-04-03 12:08 GMT
కడప, నంద్యాల జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన
  • whatsapp icon

నేడు కడప జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఉదయం కడప విమానాశ్రయానికి చేరుకోనున్న భువనేశ్వరి కడప నియోజకవర్గంలోని 45వ డివిజన్లో కార్యకర్త కుటుంబానికి పరామర్శించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం, ప్రొద్దుటూరు మండలం, పెద్దశెట్టిపల్లి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శించారు. చంద్రబాబు స్కిల్ డెవెలెప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయినప్పుడు గుండెపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె కడప జిల్లాకు వచ్చారు.

కుటుంబాలకు పరామర్శ...
డోన్ నియోజకవర్గం, బేతంచెర్ల మండలం, హెచ్.కొట్టాల మండలంలో కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శించారు. డోన్ నియోజకవర్గం, బేతంచెర్ల మండలం, గోరుమనుకొండ గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. తర్వాత పాణ్యం నియోజకవర్గం, పాణ్యం మండలం, భూపనపాడు గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శించనున్నారు. అనంతరం నంద్యాల నియోజకవర్గం, నంద్యాల పట్టణం ఎస్.ఎన్.ఫంక్షన్ హాల్ లో బస చేయనున్నారు.


Tags:    

Similar News