పాదయాత్రపై నేడు అధికారిక ప్రకటన

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుంది.;

Update: 2022-12-28 03:55 GMT
nara lokesh, tdp,  padayatra
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుంది. వచ్చే నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలై శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది.

రూట్ మ్యాప్ వివరాలు...
దాదాపు ఏడాదికిపైగానే పాదయాత్ర లోకేష్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయంకోసం లోకేష్ ఈ పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. నేడు టీడీపీ సీనియర్ నేతలు లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ తో పాటు ఇతర వివరాలను వెల్లడించనున్నారు.


Tags:    

Similar News