ఏపీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి;
ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరుకుంది. ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. సంక్రాంతి తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
విదేశాల నుంచి....
కొత్తగా ఒమిక్రాన్ సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే. వారిలో ఒమన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్ నుంచి వచ్చని ఇద్దరు, అమెరికా, సూడాన్, గోవా నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఇందులో కృష్ణా జిల్లాకు చెందిన వారు ముగ్గురు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నలుగురు ఉన్నారని తెలిసింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.