నేటి నుంచి "మా నమ్మకం నువ్వే జగనన్న"
నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నేటి నుంచి అధికార వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించింది;
నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నేటి నుంచి అధికార వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించింది. మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్ అంటూ ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను గురించి గృహసారధులు వివరించనున్నారు. 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏడు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 20వ తేదీ వరకూ...
1.60 కోట్ల కుటుంబాలను ఈ సందర్భంగా కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజలను కలుస్తూ వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నెల 20వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల నేతృత్వంలో గృహసారధులు ఇంటింటికి వెళ్లి పథకాలను గురించి తెలిపి, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ఐదు ప్రశ్నలతో ప్రజా సర్వేను కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు.