Rain Alert : ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మూడు రోజులు బయటకు రాకపోవడమే మంచిదట
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది;
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి రెండు రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు పలుచోట్ల అతితీవ్రభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే చాన్స్ ఉంందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.