Andhra Pradesh : ఏపీలో ఆపరేషన్ గరుడ
ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు;

ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డిజిపి ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్ మరియు విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై తనిఖీలు చేస్తున్నారు. మెడికల్ దుకాణాలు, ఏజెన్సీస్ పై దాడులు చేస్తూ సోదాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ఏపీ వ్యాప్తంగా ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఒకే సారి రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు...
విజయవాడలో భవానీపురం, గుణదల ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడ నిర్వాహిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గుణదల మెడికల్ షాప్ లో ఆకస్మిక దాడులు నిర్వహించి సోదాలు జరుపుతున్నారు. డిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని, అనుమతి లేని మందులు విక్రయించే వారిపై చర్యలు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలని, అలా కాకుండా విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.