అధికారులను గౌరవించకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు

అధికారులకు గౌరవం ఇవ్వాల్సిందేనని, నేతలు థిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Update: 2024-07-03 12:50 GMT

అధికారులకు గౌరవం ఇవ్వాల్సిందేనని, నేతలు థిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఎమ్మెల్యేల నుంచి జనసేన నేతలందరూ ఇది గుర్తించుకోవాలన్నారు. పిఠాపురం లో ఆయన మాట్లాడుతూ తనను అసెంబ్లీ గేట్లు తాకనివ్వమని వైసీపీ నేతలు కొందరు అన్నారని, కానీ గేట్లు బద్దలు కొట్టి అసెంబ్లీలో అడుగుపెట్టామని ఆయన అన్నారు. వంద శాతం స్ట్రయిక్ రేటు మామూలు విషయం కాదని, 21 స్థానాలకు 21గుర్తించామని తెలిపారు. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో బలం ఇచ్చేలా చేసిందన్నారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన నీరు, రహదారులు ఇస్తామని తెలిపారు.

మూడు ఎకరాలు కొన్నా...
తాను పిఠాపురం వాస్తవ్యుడనని, ఇక్కడే మూడు ఎకరాలను కొనుగోలు చేశానని, రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని పవన్ కల్యాణ‌్ తెలిపారు. తొమ్మిది నెలల్లో దొరకని ఒక ఆడబిడ్డ తొమ్మిది రోజుల్లోనే దొరికిందన్నారు. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలు కన్నీరు తుడవని అధికారం ఎందుకని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రక్తం చిందించకుండా అరాచక ప్రభుత్వాన్ని కూలదోశారన్నారు. ప్రజాస్వామ్యం శక్తి ఏంటో ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు వేసి కూటమికి పట్టం కట్టారన్నారు. ఇంత మెజారిటీలు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా రాలేదని టీడీపీ నేతలే చెబుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.


Tags:    

Similar News