Pawan Kalyan :రుషికొండ ప్యాలెస్‌లో పవన్ కల్యాణ్
విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం రుషికొండ ప్యాలెస్ కు వెళ్లారు;

saraswati power lands
విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం రుషికొండ ప్యాలెస్ కు వెళ్లారు. అక్కడ భవన నిర్మానాన్ని పరిశీలించారు. విశాఖ నగరంలో ఉన్న రుషికొండకు వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ కార్మికులతో మాట్లాడారు. రుషికొండ భవనంలో కొందరు రోజు వారీ కూలీలు పనిచేస్తున్నారు. వారితో మాట్లాడి స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అంతకు ముందు...
అంతకుముందు విజయనగరం జిల్లాలో గొర్ల గ్రామంలో పర్యటించారు. అతి సార బాధితులను పరామర్శించారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అక్కడ అధికారులతో మాట్లాడి సమస్య తలెత్తడానికి గలకారణాలను అడిగి తెలుసుకున్నారు. రక్షిత మంచినీటి సరఫరాను నిరంతరం సరఫరా చేయాలని చెప్పారు. అంతే కాదు గొర్ల గ్రామంలో వైద్య శిబిరాన్ని మరికొంత కాలం పాటు కొనసాగించాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించనున్నారు.