పెట్రోలు ధరలు తగ్గిస్తారా? లేదా?
పెట్రోలు ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత మర్చిపోయారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు;

పెట్రోలు ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తర్వాత మర్చిపోయారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో ఇవ్వాళ పెట్రోల్ ధర రూ. 109.60పైసలు. డీజిల్ ధర రూ 97.47 పైసలు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86పైసలు. డీజిల్ ధర రూ.92.39పైసలు ఉందని తెలిపారు. అంటే తమిళనాడుతో పోల్చితే ఏపీలో ర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువగా వసూలూ చేస్తున్నారని అన్నారు. కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90పైసలు. డీజిల్ ధర రూ.88.99పైసలు, కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువ అని అన్నారు.
మిగిలిన రాష్ట్రాల్లో...
పక్కనున్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46పైసలు. డీజిల్ ధర రూ. 95.70పైసలు. తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద మూడు రూపాయలు అదనం అని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. గత 10 ఏళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్ప మరోకటి కాదని, . వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారని, దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందువరసలో పెట్టి.. రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.