28 లక్షల ఇళ్లపై స్టిక్కర్లు

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నిర్వహిస్తున్న పీపుల్స్ సర్వే కార్యక్రమం నేటికి నాలుగు రోజులు గడిచింది.;

Update: 2023-04-10 12:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో  అధికార వైసీపీ నిర్వహిస్తున్న పీపుల్స్ సర్వే కార్యక్రమం నేటికి నాలుగు రోజులు పూర్తయింది. "జగనన్నే మా భవిష్యత్తు" పీపుల్స్ సర్వే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు మొదలు మారుమూల గ్రామం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు ప్రజాభిప్రయాన్ని సేకరిస్తున్నారు.

20వ తేదీ వరకూ...
నిన్న టికే "జగనన్నే మా భవిష్యత్తు"లో 28 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయని పార్టీ వర్గాలు తెలిపారు. జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా 20 లక్షల కుటుంబాల మిస్డ్ కాల్స్ ఇచ్చాయని తెలిపారు. 175 నియోజకవర్గాల్లోని 15 వేలకు పైగా సచివాలయాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News