చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
చంద్రబాబు పర్యటించనున్న వాహనాన్ని పోలీసులు నిలిపేశారు. చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటక వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు;
చంద్రబాబు పర్యటించనున్న వాహనాన్ని పోలీసులు నిలిపేశారు. చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటక వెళుతుండగా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనలో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
ప్రచార రధాన్ని...
కుప్పంలో చంద్రబాబు నేడు పర్యటించాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా బెంగుళూరుకు విమానంలో చేరుకుని అక్కడి నుంచి కుప్పం బయలుదేరి వస్తారు. ఈ నేపథ్యంలో వాహనాన్ని కర్ణాటక సరిహద్దులకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు ప్రచార రధాన్ని అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.