మేకను మింగిన కొండచిలువ..కక్కలేక.. మింగలేక ఉంటే..
తర్వాత అది కదల్లేకపోతుందని గ్రహించిన గ్రామస్తులు.. అది మేకను మింగినట్లు గుర్తించారు. కొండచిలువను చంపి..
కొండచిలువ.. దానిని చూస్తేనే గుండెల్లో గుబులు పుడుతుంది. అది ఒకసారి దేన్నైనా చుట్టుకుందంటే ఊపిరాడక చనిపోవాల్సిందే. కొండచిలువకు అంతబలం ఉంటుంది. అందుకే కొండచిలువ కనిపిస్తే.. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండరు. తాజాగా ఓ కొండచిలువ మేకను మింగేసిన ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చుక్కలవాని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. మేకను మింగిన కొండచిలువ పొట్ట ఉబ్బి.. ఊపిరి తీసుకోడానికి ఆపసోపాలు పడింది. కదల్లేక.. కక్కలేక.. మింగలేక ఉన్న కొండచిలువను చూసిన గ్రామస్తులు తొలుత భయపడ్డారు.
తర్వాత అది కదల్లేకపోతుందని గ్రహించిన గ్రామస్తులు.. అది మేకను మింగినట్లు గుర్తించారు. కొండచిలువను చంపి.. దాని పొట్టలో ఉన్న మేకను బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన మిగతా గ్రామస్తులు.. ఆ కొండ చిలువను చూసేందుకు తరలివచ్చారు. కాగా.. గత నెల 8వ తేదీన చిత్తూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని భరద్వాజ తీర్థంలో 13 అడుగుల కొండచిలువ మేకను మింగేసింది. ఆ తర్వాత అది కదల్లేక పోవడంతో ఆలయ ఉద్యోగులు గమనించి అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకుని, మింగిన మేక పిల్లను కక్కించి, రామాపురం అటవీ ప్రాంతంలో వదిలివేశారు.