Tirumala : తిరుమలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ మామూలుగా లేదుగా

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు.;

Update: 2025-03-25 02:29 GMT
today darsan time in  tirumala,  rush,  devotees,  tuesday
  • whatsapp icon

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. గత పది రోజుల నుంచి తిరమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి కాలం సమీపించక ముందే భక్తులు తిరుమలేశుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని వెళుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఎండలు మరింత ముదరకముందే ఏడుకొండల వాడి చెంతకు వెళ్లి వద్దామన్న కాంక్షతో తిరుమల కొండకు బయలుదేరి వస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి...
ముందుగా బుక్ చేసుకున్న ప్రత్యేక దర్శనం టిక్కెట్లతో పాటు రోజు వారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పరీక్షలు ముగియక ముందే తిరుమలలో రద్దీ పెరగడంతో అందుకు అనుగుణంగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వసతి గృహాలకు ఇబ్బంది పడకుండా భక్తులు అందరికీ లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారుల తెలిపారు.
18 గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడున్నర గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,358 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,024 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.45 కోట్ల రూపాయల వచ్చిందని అధికారులు వెల్లడించారు.






Tags:    

Similar News