Breaking : జనసేన లోకి కొణతాల .. త్వరలోనే చేరిక
సీనియర్ నేత కొణతాల రామకృష్ణ త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నారని తెలిసింది. ఆయన ఇప్పటికే జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు;

konatala ramakrishna
సీనియర్ నేత కొణతాల రామకృష్ణ త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నారని తెలిసింది. ఆయన ఇప్పటికే జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న కొణతాల రామకృష్ణ ఇప్పటి వరకూ ఏ పార్టీలోనూ లేరు. ఆయన అన్ని పార్టీలకూ దూరంగా ఉన్నారు. కానీ కొంతకాలంగా యాక్టివ్ కావడంతో ఆయన ఏదో ఒక పార్టీలో చేరతారన్న ప్రచారం అయితే జరుగుతుంది.
పవన్ ను కలిసి...
ప్రచారానికి అనుగుణంగానే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. త్వరలో పవన్ కల్యాణ్ ను కలిసి ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. టీడీపీ, జనసేన కూటమిగా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతుండటంతో గెలుపు ఖాయమని ఆయన అనుచరులు భావిస్తున్నారు.