తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. నాలుగైదు రోజులు ఓపికపట్టండి
నైరుతి రుతుపవనాలు నిన్న కేరళలో ప్రవేశించాయి. దీంతో కేరళలో వర్షాలు కురుస్తున్నాయి.;

Ap weather updates
నైరుతి రుతుపవనాలు నిన్న కేరళలో ప్రవేశించాయి. దీంతో కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళతో పాటు లక్షద్వీప్ లో నైరుతి రుతుపవనాలు విస్తరించినందున త్వరలోనే ఏపీలోనూ అడుగుపెడతాయని పేర్కొంది. ఇప్పటికే కేరళలోని పథ్నాలుగు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
నాలుగురోజుల్లో...
వర్షాలు భారీగా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో పాటు ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రోహిణి కార్తెతో ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం ఎనిమిది గంటలు దాటితే బయటకు రాలేకపోతున్నారు. రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు కొంత ఉపశమనం పొందే అవకాశముంది.