క్యాట్ ఆదేశాలపై హైకోర్టుకు ప్రభుత్వం.. ఏబీకి పోస్టింగ్ కష్టమేనా?
ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. . క్యాట్ ఉత్తర్వులు అమలును నిలిపేయాలని ప్రభుత్వం పిటీషన్ లో కోరింది. దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ఈ నెల 23వ తేదీన దీనిపై విచారిస్తామని తెలిపింది.
రెండు సార్లు...
ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండు సార్లు సస్పెండ్ చేయడాన్ని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ తప్పు పట్టింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలంలో ఆయనకు జీతం ఇవ్వాలని కూడా ఆదేశించింది. అయితే తిరిగి ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో ఆయనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కాగా ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.