వైసీపీలో చేరిన టీడీపీ నేత

నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసీపీలో చేరారు.;

Update: 2023-05-05 13:15 GMT

నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసీపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు మాజీ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లారు.

ఆత్మకూరు నుంచి...
ఆయన అప్పట్లో ఆత్మకూరు నియోజకవర్గం టిక్కెట్ ఆశించి టీడీపీలో చేరినా అక్కడ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన తిరిగి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ ఇందుూరు వెంకటరమణా రెడ్డి కూడా వైసీపీలో చేరారు.


Tags:    

Similar News