జగన్ రెడ్డీ రాజ్యాంగం ఎక్కడ?

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు.;

Update: 2022-11-26 07:07 GMT

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. పాలకుడు మంచి వాడైతే మంచి ఫలితాలు వస్తాయని, చెడ్డవాడయితే చెడు ఫలితాలు వస్తాయని అంబేద్కర్ ఆనాడే చెప్పారన్నారు. జగన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఆయన అప్పుడే ఊహించి చెప్పి ఉంటాడని అన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమన్యాయం అందించే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని చంద్రబాబు అన్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగ విలువలను....
రాజ్యాంగ విలువలను పాటించడం లేదని ఆయన అన్నారు. రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ ప్రజల హక్కును, స్వేచ్ఛను హరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. చట్టసభలను అసత్యాలకు వేదికగా తయారు చేశారన్నారు. 42 నెలల్లో 330 కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమంలో ముందున్న రాష్ట్రం ఇప్పుడు వెనక్కు ఎందుకు వెళ్లిందో ఆలోచించాలన్నారు. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.


Tags:    

Similar News