Breaking : విచారణ వాయిదా.. 30వరకూ చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా పడింది.;
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా పడింది. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో నేడు జరిగింది. ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 30వ వరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. హైకోర్టు బెయిల్ ను తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 28 వరకూ...
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును సీఐడీ నిందితుడిగా చేర్చింది. ఫైబర్ నెట్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని పేర్కొంది. దీనిపై తనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేయాలని ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ నెల 28న స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఈ నెల 28వ తేదీతో ముగియనుంది. దీపావళి సెలవుల తర్వాత క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.