రేపు, ఎల్లుండి చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు, ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు, ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తారు. ఎల్లుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు. నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి నష్టపోయిన పంటను చంద్రబాబు పరిశీలిస్తారు. వరదకు మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో...
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. చంద్రబాబు నేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి రేపు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.